కోటిమందికి ప్రయోజనం, ఖజానాపై రూ. 9448 కోట్లు భారం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం తెలిపారు.
ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 49.18 లక్షల మంది ఉద్యోగులు, 64.89 లక్షల మంది పింఛనుదారులకు మేలు జరుగుతుంది. కేంద్రం సాధారణంగా ప్రతీ ఏడాది రెండుసార్లు ఉద్యోగుల డీఏను పెంచుతుంది.
ఈ ఏడాది జులై 1 నుంచి పెంచిన డీఏ అమలులోకి వస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజా నిర్ణయంతో కేంద్ర ఖజానాపై రూ.9448 కోట్ల అదనపు భారం పడనుంది.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను అందిస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచింది.