నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయం నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. 15 కి.మీ వేగంతో దూసుకొస్తున్న కారణంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపిన వాతావరణ శాఖ, దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండం కారణంగా
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు ఉండాలని సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు.