నైజీరియాలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో కనీసం 94మంది చనిపోయారు, మరో 50మంది గాయపడ్డారని ఆ దేశపు పోలీసులు వెల్లడించారు.
నైజీరియా ఉత్తరభాగంలోని జిగావా రాష్ట్రం మజియా పట్టణంలో మంగళవారం రాత్రి ఆయిల్ ట్యాంకర్ కూలిపోయింది. ఒక ట్రక్కును ఢీకొనబోయిన ట్యాంకర్‌ను డ్రైవర్ ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ట్యాంకర్ పడిపోయింది. దాన్నుంచి రహదారి మీదకు ఇంధనం ఒలికిపోయింది. ఆ ఇంధనాన్ని తీసుకోడానికి పెద్దసంఖ్యలో జనాలు గుమిగూడారు. అంతలో ట్యాంకర్ పేలిపోయింది.
‘ఇప్పటివరకూ 94మంది చనిపోయినట్లు నిర్ధారణ అయింది. సుమారు 50మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది’ అని పోలీస్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
వైద్యసహాయం అందించడం కోసం దగ్గరలోని ఎమర్జెన్సీ రూమ్స్‌కు వెళ్ళాలంటూ నైజీరియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక డాక్టర్లకు పిలుపునిచ్చింది.