రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్‌కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్-యూరియా ఎరువులకు గాను రూ.24,475 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది.
క్వింటాల్ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా రూ.150 పెంచింది. దీంతో గతంలో రూ.2,275గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2,425కి పెరిగినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
క్వింటాల్ ఆవాలుకు అత్యధికంగా రూ.300, క్వింటాల్ పెసరకు రూ.275, శనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దుతిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,642 కోట్లు వ్యయం చేయనుంది.