అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులుగా నిర్ధారించారు.
సౌత్ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రమాద ఘటన విషయాన్ని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రవాస భారతీయ ప్రతినిధులు చెప్పారు.
ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.