స్విట్జర్లాండ్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తెను ఉగాండాలో అదుపులోకి తీసుకుని నిర్భంధించారు. తన కుమార్తె వసుంధర ఓస్వాల్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పంకజ్ ఓస్వాల్ ఉగాండా అధ్యక్షుడికి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్ అవకతవకల కేసుతో సంబంధంలోని తన కూతురుని ఉగాండాలో నిర్భంధించారని పంకజ్ ఓస్వాల్ వాపోయారు. తన కుమార్తె వద్ద నుంచి ఫోను కూడా లాగేసుకున్నారని, న్యాయ సహాయం కూడా తీసుకోనివ్వడం లేదని ఆయన రాసిన లేఖలో తెలిపారు.
పీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వసుంధరా ఓస్వాల్ పనిచేస్తోంది. కార్పొరేట్, రాజకీయ అవకతవకల కేసులో స్థానిక కోర్టు ఆమెను విడుదల చేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఆమె తండ్రి పంకజ్ రాసిన లేఖ ద్వారా స్పష్టమైంది. ఆమెపై అనవసరపు అభియోగాలు మోపుతున్నారంటూ పంకజ్ తెలిపారు. తన కుమార్తెను విడిపించాలంటూ ఆయన ఉంగాడా అధ్యక్షుడికి లేఖ రాయడంతోపాటు, దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.