కెనడా భారత్ మధ్య దౌత్యసంబంధాలు మరోసారి బెడిసికొట్టాయి. నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై విదేశాంగశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలు దేశం వీడాలని ఆదేశించింది. అక్టోబరు 19కల్లా ఆరుగురు దౌత్యవేత్తను భారత్ వీడాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. కెనడాలోని భారత దౌత్యవేత్తలు, హై కమిషనర్‌ను కూడా వెంటనే వెనక్కు రప్పించాలని నిర్ణయించింది. వారికి రక్షణ విషయంలో కెనడాపై తమకు విశ్వాసం లేదని భారత్ ప్రకటించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మను కూడా అనుమానితుడిగా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. భారత దౌత్యవేత్తను అనుమానితుడిగా పేర్కొనడంపై భారత్… కెనడా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. కెనడాలోని భారత దౌత్యవేత్తలకు రక్షణ విషయంలో అనుమానాలున్నాయని భారత్ వారిని వెనక్కు పిలిపిస్తోంది. కెనడా ప్రధాని ట్రూడో భారత వ్యతిరేక కార్యక్రమాలకు నిరసన తెలిపే హక్కు తమకు ఉందని బదులిచ్చింది.
కెనడా కూడా స్పందించింది. ఆ దేశంలోని ఆరుగురు భారత దౌత్యవేత్తలపై వేటు వేసింది. దేశంలో జరిగిన హింసలో వారికి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలున్నాయని కెనడా ఆరోపించింది.