ఏపీలో మద్యం టెండర్లు, షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. 3396 షాపులకు 90 వేలకుపైగా దరఖాస్తులు రావడంతో ఇవాళ లాటరీ తీశారు. షాపులు దక్కించుకున్న వారు రేపటి నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బడులు, గుడులకు కనీసం వంద మీటర్ల దూరం పాటించాలని ప్రభుత్వం ముందుగానే పాలసీలో పొందుపరిచింది.
తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చాయని ఎక్త్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం డిస్టలరీలు స్వాధీనం చేసుకుని, నాణ్యతలేని మద్యం సరఫరా చేసిందని ఆయన ఆరోపించారు. మంత్రుల సబ్ కమిటీ పలు రాష్ట్రాల్లో పరిశీలించిందని, వారి సూచనల మేరకు నూతన మద్యం పాలసీ తీసుకువచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.