బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది తుపాను మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు (heavy rains) పడుతున్నాయి. ఇది తుపానుగా మారితే మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహిణ సిబ్బందిని సిద్దం చేశారు. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాద ముందని ఐఎండి (IMD) హెచ్చరికలు జారీ చేసింది. గడచిన 24 గంటల్లో 4 నుంచి 8 సెం.మీ వర్షపాతం నమోదైంది.