సికింద్రాబాద్ మోండామార్కెట్ వద్ద నున్న ముత్యాలమ్మ వారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పోలీసు అధికారులు పరిశీలించారు.
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కంటోన్నెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కూడా ఆలయం వద్దకు చేరుకున్నారు.పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.