ఆన్‌లైన్ బెట్టింగులు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ బెట్టింగులకు బలయ్యాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని దిగువగాలిగడ్డకు చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగుల్లో రూ.24 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మనాభరెడ్డి, దసరాకు సెలవు పెట్టి స్వగ్రామం బయలుదేరాడు. గ్రామానికి సమీపంలో రెడ్డివారిపల్లె వద్ద రైలు దిగి పట్టాలపై తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు.
ఘటన తరవాత రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వారు విచారణ చేపట్టారు. మృతుడి ఫోన్, ఆధార్ కార్డుల ఆధారంగా పద్మనాభరెడ్డిగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఆన్‌లైన బెట్టింగుల్లో (onlinebettings) డబ్బు పోతే ఇక తిరిగి రాదని పద్మనాభరెడ్డి సూసైడ్ నోటులో రాశాడు. పోలీసులకు మోసం చేసిన వారి ఫోన్ నెంబర్లు, బ్యాంకు అకౌంటు వివరాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని వాపోయాడు. ఎవరూ బెట్టింగులకు (bettingmafia) పాల్పడవద్దని సూచించాడు.