ఆర్జి కర్ ఆసుప్రతి ఘటన బెంగాల్‌ను కుదిపేస్తోంది. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పదో రోజుకు చేరింది. వారికి మద్దతుగా 200 మంది వైద్యులు మూకమ్మడి రాజీనామా చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో మరో 77 మంది డాక్టర్లు రాజీనామాకు సిద్దమయ్యారు.
కోల్‌కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచారం తరవాత కొనసాగిన నిరసనలు గత నెల సీఎం మమతా బెనర్జీ హామీతో ముగిశాయి. అయితే ముఖ్యమంత్రి హామీలు గాలికొదిలేయడంతో మరలా జూనియర్ వైద్యులు నిరాహార దీక్షకు దిగారు. వారికి డాక్టర్లు మద్దతు పలికారు. దీంతో ఇప్పటికే 200 మంది డాక్టర్లు మూకమ్మడి రాజీనామాలు చేశారు. మరో 77 మంది రాజీనామాకు సిద్దమయ్యారు.