ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను కేంద్రం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దేశం అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగంగా, సమర్థంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ను 2021, అక్టోబర్ 13న అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రారంభించి మూడేళ్ళు అయిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, దేశంలోని రైల్వే, రోడ్లు, ఓడరేవులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో ‘గతిశక్తి’ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి దొహదపడుతుందన్నారు. నూతన ఆవిష్కరణలను సైతం ఈ ప్రాజెక్టు ప్రోత్సహిస్తోందన్నారు.