ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ రెండు రోజుల్లో అమలులోకి రానుంది. ప్రైవేటు మద్యం దుకాణాలు అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్లకు సంబంధించి ఎమ్మార్పీ పై ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.
ఈ మేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయల మేర పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎమ్మార్పీ ధర రూ.150.50లకుపైగా ఉంటే రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.