లోకోపైలెట్ ఎబినేజర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద గత వారం లోక్ ఫైలెట్ డి.ఎబినేజర్‌ను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్కుమార్గా గుర్తించారు. శనివారం ఉదయం అప్పియార్డు సమీపంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. బిహార్‌లోని షైనీ బర్బార్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు.
బిహార్ నుంచి జీవనోపాధికోసం దేవ్ కుమార్ విజయవాడ వచ్చాడు. ఇక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు సరిపోకపోవడంతో కనిపించిన వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. గత వారం విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద ఎబినేజరను డబ్బు అడిగాడు. లేవని చెప్పడంతో వెంట తెచ్చుకున్న రాడ్డుతో తలపై బలంగా మోదాడని పోలీసులు చెబుతున్నారు. తరవాత ఎబినేజర్ జేబులోని రూ.750 తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలోనే అనేక మందిని బెదిరించి దేవ్ కుమార్ డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.