అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఫ్లోరిడాలో మిల్టన్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వేలాది ఇళ్ల కప్పులు లేచిపోయాయి. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల వాసులను తరలించినా 8 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. రోడ్లు బురదతో నిండిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. సరపోటీ కౌంటీలో ఒకేరోజు 45 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి.
రెండు వారాల కిందట హెలీన్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే మరో హరికేన్ విరుచుకుపడింది. పుట్ బాల్ స్టేడియం కప్పులు లేచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోయాయి. పెనుగాలులకు వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది తాగునీరు, ఆహారం, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాల్లో రెండు తుపానులు విరుచుకుపడటంతో ప్లోరిడాలో పరిస్థితి దారుణంగా తయారైంది.