హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ను అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వీహెచ్పీ ఈ ప్రకటన జారీ చేసింది. భారత్-బంగ్లా మ్యాచ్ను అడ్డుకుంటామని తేల్చిచెప్పింది.
ఉప్పల్ మ్యాచ్ లో ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా పోయేదేమీ లేదన్న వీహెచ్పీ, బంగ్లాదేశ్లో హిందువులు మాత్రం ఓ వర్గానికి లక్ష్యంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మ్యాచ్ను అడ్డుకుంటామని తెలిపిన వీహెచ్పీ, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపింది.
వీహెచ్పీ హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా భద్రత కల్పిస్తున్నారు. మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వాన కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశముంది.