శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజున
భ్రమరాంబదేవి అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. నవదుర్గా స్వరూపాల్లో తొమ్మిదో రూపమే సిద్ధిదాయిని అమ్మవారు. ఈ అలంకారంలో అమ్మవారిని పూజించడం ద్వారా సిద్ధులన్నింటిని పొందవచ్చు అని దేవీభాగవతం చెబుతోంది. సాయంత్రం ఆదిదంపతులకు అశ్వవాహన సేవ నిర్వహించారు.
నవరాత్రుల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్థనరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులకు ఆలయ సిబ్బంది వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.