దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్‌లో హీరో నిఖిల్ రేసర్‌గా కనిపించగా, ప్రేమకథతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ లో హీరోయిన్ గా నటించారు.
మరో కథానాయికగా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. కమెడియన్ వైవా హర్ష కూడా కీలక పాత్రలో నటించాడు. టాలీవుడ్ బడా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కార్తీక్ బాణీలు అందిస్తున్నారు.