వైసీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పొందిన నందిగం సురేష్, కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో అరెస్టై గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలుకు వెళ్లే సమయంలోనే తాను భుజం నొప్పితో బాధపడుతున్నట్లు నందిగం సురేష్ పోలీసులకు తెలిపారు.
ఇవాళ నందిగం సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జైలు అధికారులు ఆయన్ని జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేష్‌కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.