రేషన్‌కార్డు దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో దసరా నేపథ్యంలో ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట నూనెను తగ్గింపు ధరపై రేషన్ కార్డుదారులకు అందజేసేందుకు సిద్ధమైంది.
విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ధరల పెరుగుదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటుకు వంటనూనెలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుంచి నెలాఖరు వరకూ పామాయిల్ లీటర్ రూ.110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించాలని సూచించారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్ , ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను తాజాగా నిర్ణయించిన ధరలపై అందించాలని సూచించారు.