తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన దివ్వెల మాధవిపై కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరవాత, మాధవి ఆలయం ముందు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మేమిద్దరం లివింగ్ రిలేషన్లో ఉన్నామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లై విడాకులు తీసుకోకుండానే, ఇద్దరూ లివింగ్ రిలేషన్లో ఎలా ఉంటారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
దివ్వెల మాధవిపై కొన్ని హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు తిరుపతి వన్ టౌన్లో కేసు నమోదైంది. తిరుమల తిరుపతి సాంప్రదాయాలకు విరుద్దంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై మాధవిపై కేసు నమోదు చేశారు.