కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు రాష్ట్రాల వాటాను ప్రతి నెలా విడుదల చేస్తుంటారు. తాజాగా రాష్ట్రాలకు రూ. 178173 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో ముందస్తు పన్నుల వాటా రూ.89086 కోట్లుతో కలపి మొత్తం రూ.178173 కోట్లు విడుదల చేశారు. ఇందులో ఏపీ వాటా రూ.7211 కోట్లు, తెలంగాణ వాటా రూ.3745 కోట్లు విడుదల చేశారు.
జీఎస్టీ ముందు కేంద్రం వసూలు చేసి అందులో రాష్ట్రాలకు అందాల్సిన వాటాను ప్రతి నెలా బదిలీ చేస్తోంది. ఆదాయపన్నుల నుంచి కూడా రాష్ట్రాలకు వాటా అందుతుంది. ఇలా ప్రతి నెలా దాదాపు రూ.170000కోట్లకుపైగా నిధులకు కేంద్రం రాష్ట్రాలకు అందిస్తోంది. కేంద్రం రాష్ట్రాలకు అందించే వాటాను పెంచాలంటూ పలు రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.