ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపం అనంతరం ఏపీ క్యాబినెట్ వాయిదా పడింది. ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రతన్‌కు నివాళులు అర్పించేందుకు ముంబై వెళ్లాల్సి ఉండటంతో ఏపీ క్యాబినెట్ వాయిదా పడింది. ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ సమావేశం కాగానే గత రాత్రి కన్నుమూసిన రతన్ టాటాకు సంతాపం తెలిపారు. అనంతరం క్యాబినెట్ సమావేశం వాయిదా వేశారు.
టాటా సన్స్ గౌరవ అధ్యక్షులు రతన్ టాటా అనారోగ్యంతో గత రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు ముంబైలో జరగనున్నాయి. అంత్యక్రియలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, నారా లోకేశ్… రతన్ టాటాకు చివరి నివాళి అర్పించేందుకు ముంబై బయలుదేరి వెళ్లారు.