హ్యూందాయ్ మోటార్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్దమైంది. ప్రఖ్యాత మోటార్ వాహనాల తయారీ దిగ్గజం హ్యూందాయ్ అతి పెద్ద ఐపీవో ద్వారా రూ.27,870 కోట్లు సమీకరించనుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లకు 14 బిడ్లు వేసుకునే అవకాశం కల్పించారు.
రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 13720 కనీస పెట్టుబడి పెట్టాల్సి ఉంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరు రూ.1865 నుంచి రూ.1960 మధ్య లభించనుంది. 14 కోట్ల షేర్ల అమ్మకాల ద్వారా కంపెనీ 27 వేల కోట్లకుపైగా పెట్టుబడులు సమీకరించనుంది. కంపెనీ విలువ లక్షా 60 వేల కోట్లుగా ప్రకటించారు. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈవీ వాహనాల తయారీలో కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో ఇదే అతి పెద్దది కావడం విశేషం.
గతంలో ఎల్ఐసి ఐపీవో ద్వారా రూ.21 వేల కోట్లు సమీకరించింది. ఇప్పటి వరకు దేశంలో అదే అతిపెద్ద ఐపీవో. తాజాగా హ్యూందాయ్ ఆ రికార్డును బ్రేక్ చేయనుంది.ఉద్యోగుల కోసం 7 లక్షల 75 వేల షేర్లు కేటాయించారు. 14 కోట్లకుపైగా షేర్లు ఐపీవో ద్వారా కేటాయించునున్నారు.