దేవాలయాల్లో పూజలు నిర్వహించే అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. పూజలు, క్రతువులు, దేవాలయాల్లో నిర్వహించే దైవిక కార్యక్రమాల్లో దేవాదాయ కమిషనర్ సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా ఆలయాల్లో ఉండే సాంప్రదాయాలను అక్కడి అర్చకులే కాపాడుకుంటూ, వాటిని నిర్వహించాలని ప్రభుత్వం నోట్లో పేర్కొంది.
అర్చకులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ద్వారా దేవాలయాల్లో అధికారుల ఆగడాలకు అడ్డుకట్టపడనుంది. అర్చకులు, వేదపండితుల నిర్ణయాల మేరకు దేవాలయాల్లో పూజలు, క్రతవులు నిర్వహించనున్నారు. అక్కడి ఆచారాలు కాపాడుకుంటూ పూజలు నిర్వహించనున్నారు.