ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన అక్టోబర్ 8న చోటు చేసుకుంది.
ముస్సోరిలో నౌషాద్ అలీ, హసన్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు టీస్టాల్ నిర్వహిస్తున్నారు. అక్కడ టీ తాగడానికి కొందరు పర్యాటకులు వెళ్ళారు. తయారుచేస్తున్న టీలో వారు ఉమ్మివేయడాన్ని పర్యాటకులు గమనించారు. అదేమని ప్రశ్నించిన పర్యాటకులను బూతులు తిట్టి బెదిరించారు. ఈ సంఘటన గురించి పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విషయం గ్రహించిన నౌషాద్ అలీ, హసన్ అలీ అక్కణ్ణుంచి పరారయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాయపూర్ జిల్లాకు చెందిన హిమాంశు బిష్ణోయి అనే పర్యాటకుడు ముస్సోరి వెళ్ళాడు. అతనే, టీస్టాల్ నిర్వాహకులు ఉమ్మివేస్తున్న సంగతిని వీడియో తీసాడు. ఆ వీడియో ఆధారంగానే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదయింది.
ఆ ఫిర్యాదు ప్రకారం, హిమాంశు బిష్ణోయి సెప్టెంబర్ 29న ముస్సోరీలో పర్యటిస్తున్నాడు. ఆరోజు ఉదయం 6.30 సమయంలో స్థానిక లైబ్రరీ చౌక్ (గాంధీ చౌక్) దగ్గరున్న ఒక టీస్టాల్కు వెళ్ళాడు. అక్కడ టీ తాగి చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను తన కెమెరాలో చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా, స్టాల్ నిర్వాహకుల్లో ఒకడైన నౌషాద్ అలీ టీలో ఉమ్మివేస్తున్న దృశ్యం కూడా రికార్డ్ అయింది.
దాంతో బిష్ణోయి వాళ్ళతో గొడవపడ్డాడు. వాళ్ళు క్షమాపణ చెప్పడానికి బదులు అతన్నే బూతులు తిట్టారు. అక్కడినుంచి వెంటనే వెళ్ళిపొమ్మని, లేదంటే చంపేస్తామనీ బెదిరించారు. నీ శవం కూడా ఎవరికీ దొరకనివ్వబోమంటూ భయపెట్టారు. నౌషాద్ అలీ, హసన్ అలీ ఇద్దరూ అన్నాదమ్ములు. వారి తండ్రి షేర్ అలీ నిర్వహిస్తున్న స్టాల్లో వారు పనిచేస్తున్నారు.
హిమాంశు బిష్ణోయి వెంటనే ఫిర్యాదు చేయలేకపోయాడు. కానీ తర్వాత సీనియర్ ఎస్పి కార్యాలయానికి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసాడు. అనారోగ్యకర పద్ధతులు పాటిస్తున్నారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని, మతం పేరుతో సమర్ధించుకుంటున్నారనీ, మతసామరస్యాన్ని చెడగొడుతున్నారనీ ఆయన తన ఫిర్యాదులో ఆరోపించాడు.
దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత ప్రొవిజన్ల ప్రకారం కేసు రిజిస్టర్ చేసారు. నిందితులకోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.