Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి దుర్గాపూజ

Phaneendra by Phaneendra
Oct 9, 2024, 07:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రపంచప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని బెంగాలీ క్లబ్ యుఎస్ఎ వారు నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాసభారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.

ప్రపంచంలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్ దగ్గర దుర్గాపూజా మంటపం ఏర్పాటు చేసారు. నవరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా నవమి పూజ నిర్వహించారు, దుర్గా స్తోత్రాలు పారాయణం చేసారు. ప్రవాస భారతీయులు భక్తితో పూజాపాఠాల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా రూపొందిన దుర్గాపూజా మంటపాన్ని పెద్దసంఖ్యలో అమెరికన్లు, ఇతర దేశాల వారు ఆసక్తితో గమనించారు. ఈ వేడుకల సందర్భంగా లైవ్‌బ్యాండ్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేసారు.

టైమ్స్ స్క్వేర్ దగ్గర మొదటిసారి దుర్గాపూజ వేడుకల నిర్వహణ చారిత్రకం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రవాస భారతీయుల ప్రాభవం పెరుగుతోందనడానికి ఈ వేడుకల నిర్వహణే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. భారతీయుల ఘన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఈ వేడుక కళ్ళకు కట్టింది.  

సంప్రదాయ పూజాపాఠాలు, స్తోత్రాల భక్తిపారాయణాల తర్వాత వినోదకరమైన వేడుకలు కూడా నిర్వహించారు. బాలీవుడ్ పాటలు పాడారు, వాటికి నాట్యాలు చేసారు. ఆధ్యాత్మిక శోభకు వినోదవల్లరి జతపడింది. ప్రవాస భారతీయులు, ప్రత్యేకించి బెంగాలీయులు ఈ నవరాత్రి వేడుకలతో టైమ్స్ స్క్వేర్‌లో సందడి చేసారు.

Tags: andhra today newsDasaharaDurga PujaNew YorkNRIs DasaharaPandal at Times SquareSarannavaratri CelebrationsSLIDERTimes SquareTOP NEWSusa
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.