కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ విష బీజాలు నాటుతోందని మండిపడిన ప్రధాని మోదీ, హిందువులను విభజించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ వాడుకుంటుందని దుయ్యబట్టారు.
హరియాణాలో కాంగ్రెస్ కుట్రలన్నీ విఫలమయ్యాన్నారు. మహారాష్ట్రలో రూ.7,600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హరియాణాలో ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితులు బీజేపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తమ రిజర్వేషన్లను లాక్కుంటదని దళితులు గ్రహించారన్నారు. సమాజాన్ని నాశనం చేయడానికి పూనుకున్న శక్తులన్నింటికీ రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆకాంక్షించారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ-మహాయుతి ప్రభుత్వానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.