శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీగిరిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండగగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారు మంగళవారం రాత్రి కాత్యాయనీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
ఈ అలంకారంలో కాత్యాయనీ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయముద్ర, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. అమ్మవారి దర్శనాన్ని సకల శుభప్రదాయనిగా భావిస్తారు.
కాత్యాయనిదేవి దర్శనంతో జన్మజన్మ పాపాలన్నీ తొలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లకు హంసవాహనం సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం, గ్రామోత్సవంలో భాగంగా పల్లకీసేవ నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ రోజు కాళరాత్రి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆదిదంపతులు గజవాహనంపై విహరించనున్నారు.