నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు.ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకుగాను జాన్ జె.హోప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్‌లకు నోబెల్ బహుమతి ప్రకటించారు.స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ ఈ పుర్కారాలను ప్రతి ఏటా ప్రకటిస్తుంది.
అక్టోబర్ 14 వరకు నోబెల్ బహుమతుల ప్రధానం కొనసాగనుంది. వైద్యం, భౌతికశాస్త్రంలో ఇప్పటి వరకు ప్రకటించారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యంలో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం శాంతి బహుమతి ప్రకటించనున్నారు. ఈ నెల 14న అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించనున్నారు. 1901లో నోబెల్ బహుమతుల ప్రధానం మొదలైనప్పటి నుంచి భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు 117 మందికి ప్రకటించారు.