హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాలు గెలుచుకుని బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ 38, ఇతరులు 5 స్థానాలు గెలుపొందారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఇక జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ కూటమి విజయం దక్కించుకుంది. మొత్తం 90 స్థానాలకు గాను, ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి 49 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 29, పీడీపీ 4, ఇతరులు 8 స్థానాలు గెలుచుకున్నారు.