ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటన ఖరారైంది. ఈ నెల 10,11వ తేదీల్లో లావోస్‌లో జరిగే 19వ ఈస్ట్ ఆసియా సదస్సు, 21వ ఆసియాన్ ఇండియా సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి అనేక సంవత్సరాలవుతోంది. ఇందులో భాగంగా ఏషియా పసిఫిక్ దేశాధినేతలతో ప్రధాని మోదీ వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఏషియా పసిఫిక్ దేశాల మధ్య పలు సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు,ఈ కూటమి దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించుకునేందుకు చర్యలు తీసుకునే విషయంలో చర్చలు జరగనున్నాయి.
ఇప్పటికే మోదీ ఉక్రెయిన్, రష్యా పర్యటన ముగించుకున్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ ఇరు దేశాధినేతలను కోరారు. ఇటలీ పర్యటన కూడా ఇటీవల ముగించుకున్న మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జుతో ఇవాళ సమావేశం కానున్నారు. ఇప్పటికే మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌లో పర్యటిస్తున్నారు.