అత్త కోడళ్ల మధ్య గొడవలు కొత్తేమీ కాదు కానీ. ఇలా అత్త చెవి ఊడిపోయేలా ఓ కోడలు కొరికేసిన ఘటన అమరావతి రాజధానిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరి, పావని దంపతులకు ఇద్దరు కుమారులు. కోడలు పావనికి, అత్త నాగమణికి పడటం లేదు. కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో పావని అత్త నాగమణి చెవి కొరికేసింది. దీంతో చెవి ఊడిపోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి తీసుకురావడం ఆలస్యమైందని చెవి అతికించడం సాధ్యంకాదని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.