దీపావళి సందర్భంగా దీపకాంతుల్లో అయోధ్య మెరిసిపోనుంది. త్రేతాయుగాన్ని తలపించేలా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు విద్యుత్ దీపాలతో భారీగా అలంకరణ చేయనున్నారు. దాదాపు రెండు లక్షల దీపాలను ఆలయ పరిసరాల్లో వెలిగించేందుకు సిద్ధమవుతున్నవారు. చైనాకు సంబంధించిన వస్తువులును ఆలయానికి సంబంధించిన అవసరాలకు వాడకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డుకు ఎక్కేందుకు ప్రయు త్నిస్తామన్నారు.
దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను గుర్తు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు . భారత్ భిన్నత్వం కలిగిన దేశమని గుర్తు చేసిన చంపత్ రాయ్, జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటామన్నారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.