తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం (సోమవారం) స్వామివారికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు.
సర్వభూపాలుడు అంటే అందరికీ రాజు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా ఉంటారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉంటారు. వీరంతా స్వామివారిని సేవిస్తారు. విష్ణు అంశ ఉన్నవారే రాజు అవుతారని అర్థం.