శ్రీశైలం క్షేత్రానికి సంబంధించి ఏపీ ఎన్డీయే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ఈవోగా పెద్దిరాజును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్దిరాజు సర్వీసును పొడిగింపుకు సంబంధించిన జీవో జారీ చేసింది.
పెద్దిరాజు కంటే ముందు శ్రీశైలంలో లవన్న బాధ్యతలు నిర్వహించారు. ఏడాది కాలంగా శ్రీశైల క్షేత్రంలో పెద్దిరాజు సేవలు అందిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు గడువు ముగియడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈవో గా పనిచేసిన అనుభవం పెద్దిరాజుకు ఉంది.