వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కేసులు వెంటాడుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ కు ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళనున్నారు.
వైసీపీ హయాంలో వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం అక్టోబరు 21 వరకు రిమాండ్ విధించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య జరిగింది.
నందిగం సురేశ్ 2019లో బాపట్ల నుంచి వైసీపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. 2024లో మాత్రం టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడారు. ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కూడా నందిగం సురేశ్ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.