మావోయిస్టు తీవ్రవాదం చివరిదశకు చేరిందని కేంద్ర హోంఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా కోరారు. ఇప్ప టివరకు 13 వేల మంది మావోయిస్టులు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. 2024లో 202 మంది మావోయిస్టులు చనిపోగా, 723 మంది మరణించారని పేర్కొన్నారు. మావోయిస్టుల అణచివేతలో ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు.
మావోయిస్టు రహిత రాష్ట్రాల ఏర్పాటుకు అందరి సహకారం అవసరం అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం, డీజీపీని అమిత్ షా అభినందించారు.
పదేళ్లలో మోదీ సర్కార్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పేదలకు మేలు జరిగిందన్నారు. 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేశామన్నారు. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు.
పౌరులు, భద్రతా బలగాల మరణాలు 70 శాతం తగ్గడంతో పాటు హింస ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు తగ్గాయని తెలిపారు. భారత్ ను వామపక్ష ఉగ్రవాద రహిత దేశంగా మారుస్తామన్నారు.