అరేబియాలో ఒకటి,బంగాళాఖాతంలో రెండు
అమరావతి వాతావరణ కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఏపీలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అక్టోబర్ లో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపాన్ల కారణంగా ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తాయని వివరించింది.
ఆదివారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురిశాయి. గ్రేటర్ రాయలసీమ పరిధిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వానలు పడ్డాయి. ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి జిల్లాల పరిధిలోనూ వాన కురిసింది. రాజమండ్రిలో అత్యధికంగా అత్యధికంగా 53 మిల్లీమీటర్ల వానపడింది. కొన్ని జిల్లాల్లో మాత్రం తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడారు.