మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన పోరులో భారత్ అన్ని విభాగాల్లో పాకిస్తాన్ పై చేయి సాధించి అధ్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓడినప్పటికీ నేడు జరిగిన పోరులో పాకిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విజయానికి కావాల్సిన 106 పరుగులను 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లక్ష్యఛేదనలో స్కోర్ బోర్డు 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్మృతి మంధాన (7) వెనుదిరిగింది. జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ
జోడీ 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 15 ఓవర్లకు భారత జట్టు 79/2 గా ఉంది. జెమీమా, రిచా ఘోష్ (0)వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. హర్మన్, దీప్తి శర్మ (7) ఒత్తిడికి గురికాకుండా నిలకడగా ఆడారు. హర్మన్‌ప్రీత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. సంజనా (4) ఫోర్ కొట్టడంతో భారత్ విజయం ఖాయమైంది. –
ఓపెనర్ షెఫాలీ వర్మ (32) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29) జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా రెండు వికెట్లు తీయగా, సాదియా ఇక్బాల్, ఒమైమా చెరొక వికెట్ పడగొట్టారు. భారత్ తదుపరి మ్యాచ్‌లో భాగంగా అక్టోబర్ 9న శ్రీలంకతో ఆడనుంది.