మహిళల టీ20 వరల్డ్ కప్ -2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పేలవంగా ఆడింది. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 105 పరుగులు చేసింది.
ఓపెనర్ గుల్ ఫిరోజాను రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో క్రీజులోకి అమీన్ రాగా ఆమె కూడా వెంటనే పెవిలియన్ చేరింది. సిద్రా అమీన్(8).. దీప్తి శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సోహైల్ (3) నిరాశపరిచింది. అరుంధతి రెడ్డి బౌలింగ్ లో ఆమె పెవిలియన్ చేరింది. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ మూడు వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. ఆ తర్వాత 41 పరుగుల వద్ద పాకిస్తాన్ నాలుగో వికెట్ నష్టపోయింది. 9.1 బంతికి మునీబా అలీ ఔట్ కావడంతో 11 ఓవర్లకు పాక్ 47 పరుగులు మాత్రమే చేయగల్గింది.
రియాజ్( 4) ఐదో వికెట్ గా వెనుదిరగడంతో పాకిస్తాన్ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. అరుంధతీ రెడ్డి వేసిన 12.1 బంతికి ఎల్బీగా పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. 16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్లు నష్టపోయి 76 పరుగులు చేసింది. కెఫ్టెన్ ఫాతిమా సనా(13) ను శోభనా ఆశ ఔట్ చేయగా, ట్యూబా
హాసన్ ను శ్రేయాంక పెవిలియన్ కు పంపడంతో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నిదా దార్ (28) టాప్ స్కోరర్ గా ఉన్నారు. స్కోర్ బోర్డు 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లలో పాకిస్తాన్ 105 పరుగులు మాత్రమే చేయగల్గింది.