ఏపీలోని రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ అగంతకుడు.. సీఐఎస్‌ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు మెసేజ్ పంపాడు. రెండు రోజుల కిందట ఈ లేఖ సీఐఎస్ఎఫ్ కు అందినప్పటికీ భద్రతాచర్యల్లో భాగంగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
విమానాశ్రయం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏర్పేడు పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.