ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లా పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలను ఇబ్బందిపెట్టిన తోడేళ్ల కథ ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా తాజాగా ఆరో తోడేలును గ్రామస్తులు మట్టుబెట్టారు. మేకను తోడేలు వేటాడబోగా గ్రామస్తులు అడ్డుకుని కొట్టి చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.
ఐదు తోడేళ్లు పట్టుబడిన తర్వాత 24 రోజులుగా ఆరో తోడేలు ఒక్కతే తప్పించుకు తిరుగుతూ దాడులు చేస్తోది. అటవీ అధికారులకు దొరకకుండా ముప్పుతిప్పలుపెట్టింది. గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు ‘మ్యాన్ఈటర్’ అని చెప్పలేమని అటవీ అధికారులు చెబుతున్నారు.
కొన్ని నెలల నుంచి బహ్రెయిచ్లో ఆరు తోడేళ్ళ గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తోంది. తోడేళ్ళు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు, ఓ మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు. ఆపరేషన్ భేడియా సక్సెస్ కావడంతో బహ్రెయిచ్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.