తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మలయప్ప స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. మాడవీధుల్లో స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు రోజుకు లక్ష మందికిపైగా భక్తులు కొండకు చేరుకుంటున్నారు.
తిరుమలలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో భక్తులు తడిసిముద్దయ్యారు. వీధులు చెరువులను తలపించాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.