జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడోరోజు అలంకారంలో భాగంగా చంద్రఘంటాదేవిగా దర్శనమిచ్చారు. నవదుర్గల తొమ్మిదిరూపాల్లో మూడో శక్తి స్వరూపం చంద్రఘంటాదేవి. చంద్రుడిని ఘంటాకారములో అమ్మవారు ధరించడంతో చంద్రఘంటాదేవి అంటారు. ఈ అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తే ఉపాసకులకు సౌమ్యం, వినమ్రత కల్గుతాయి. సామాన్యులకు సంసార కష్టాలు తొలిగి సద్గతి లభిస్తుంది.
ఈ దేవికి కుడివైపున పద్యం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలను , ఎడమవైపు త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని కలిగి ఉంటుంది. ఈ దేవి మస్తకంపై అర్ధచంద్రుడు అలరారుతుంటాడు. భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు శైలిపుత్రిగా, రెండోరోజు బ్రహ్మచారిణిగా అమ్మవారు దర్శనమిచ్చారు.