తిరుమలలో అతి భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన వర్షం ఐదు గంటల వరకు అంటే గంటపాటు ఏకధాటిగా పడింది. దీంతో తిరుమలలో మాడవీధులన్నీ జలమయం అయ్యాయి. భక్తులు తడసి ముద్దయ్యారు. వీధులు చెరువులను తలపిస్తున్నాయి.
తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకూ ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, వర్షం మొదలైంది. గంటపాటు సుమారు 6 సెం.మీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.