ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ కమాండర్లు హతమైనట్లు సమాచారం అందుతోంది. చనిపోయిన వారిలో కమలేశ్ అలియాస్ ఆర్కే అలియాస్ నాగరాజు, నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయినట్లు తెలుస్తోంది.కమాండర్ నాగరాజు విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే వారి కుటుంబం 2 దశాబ్దాల కిందటే గ్రామం వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
దండకారణ్యంలో మావోయిస్టుల కీలక సమావేశం జరుగుతోందనే నిఘా వర్గాల సమాచారంతో దాదాపు 3 వేల మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. దాదాపు 120 మంది మావోయిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు 31 మంది చనిపోయినట్లు అనధికార సమాచారం. మృతుల వివరాలను పోలీసులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.