లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో హమాస్ కీలక నేత సయీద్ అతల్లా హతమయ్యారు. ఆయనతోపాటు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు అంతర్జాతీయ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 2 వేల మంది చనిపోయారు. ఇందులో 250 మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. హెజ్బొల్లా అధిపతి నస్రల్లా మృతి తరవాత ఇరాన్ 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా మరో కీలక నేత హతమయ్యారు.