యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. గత నెల చివరి వారంలో హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది. అప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు.
మెగా చిత్రం హక్కులు కావాలంటూ నటిపై అత్యాచారం చేసి, నగ్న చిత్రాలతో వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందినట్లు పోలీసులు చెబుతున్నారు. విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పేదలను ఆదుకుంటున్నట్లు, లక్షల కొద్దీ డబ్బు ఇస్తున్నట్లు వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం ద్వారా హర్షసాయి లక్షలాది సబ్స్క్రయిబర్లు సాధించిన సంగతి తెలిసిందే.